ప్రపంచకప్‌లో రోడ్రీ రికార్డు.. స్పెయిన్ ఫైనల్‌కు

కలం, స్పోర్ట్స్ : స్పెయిన్ స్టార్ మిడ్‌ఫీల్డర్ రోడ్రీ (Rodri) ప్రపంచకప్‌లో (FIFA World Cup) అరుదైన ఘనత సాధించాడు. ఫ్రాన్స్‌పై 2-0తో స్పెయిన్ విజయం సాధించి ఫైనల్‌కు చేరిన మ్యాచ్‌లో రోడ్రీ తన అద్భుత ప్రదర్శనతో మరోసారి ఆకట్టుకున్నాడు. ఈ టోర్నీలో మొత్తం 655 పాస్‌లు పూర్తి చేసి, ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక పాస్‌లు పూర్తి చేసిన ఆటగాడిగా కొత్త చరిత్ర సృష్టించాడు. 1966 నుంచి నమోదవుతున్న ప్రపంచకప్ గణాంకాలలో  ఇదే అత్యధికం.

ఫ్రాన్స్‌తో జరిగిన సెమీఫైనల్‌లో రోడ్రీ మిడ్‌ఫీల్డ్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. బంతిని ఎక్కువసేపు తన ఆధీనంలో ఉంచుతూ స్పెయిన్ ఆటను సమర్థంగా నడిపించాడు. దీంతో ఫ్రాన్స్ స్టార్ ఆటగాళ్లు కైలియన్ ఎంబాప్పే, ఉస్మాన్ డెంబెలే, మైకేల్ ఒలిసే ప్రభావం చూపలేకపోయారు. స్పెయిన్ రక్షణ పటిష్టంగా నిలవడంతో గోల్‌కీపర్ ఉనాయ్ సిమోన్‌కు ఒక్క సేవ్ చేసే పరిస్థితి కూడా రాలేదు. తీవ్రమైన మోకాలి గాయం నుంచి కోలుకుని తిరిగి అత్యున్నత స్థాయిలో రాణిస్తున్న రోడ్రీ, 2024లో బాలన్ డి’ఓర్ గెలిచిన తర్వాత ప్రపంచకప్‌లోనూ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.

ఫైనల్‌కు చేరడం ఆనందంగా ఉందని రోడ్రీ పేర్కొన్నాడు. ఇప్పుడు విశ్రాంతి తీసుకుని తుది పోరుకు సిద్ధమవుతామని తెలిపాడు. బంతిని ఎక్కువసేపు తమ ఆధీనంలో ఉంచే వ్యూహాన్ని జట్టు విజయవంతంగా అమలు చేసిందని, ప్రతి ఆటగాడు అద్భుతంగా సహకరించాడని వివరించాడు. ఇప్పుడు ప్రపంచకప్ పాసింగ్ రికార్డుతో చరిత్ర సృష్టించిన రోడ్రీ, స్పెయిన్‌కు టైటిల్ అందించాలనే లక్ష్యంతో ఫైనల్‌లో బరిలోకి దిగనున్నాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>