తండ్రిని చంపినోడిపై కక్ష.. శెట్టి ఆత్మకూర్ హత్య కేసు గుట్టురట్టు!

కలం, జోగులాంబ గద్వాల్: ఈనెల 10న శెట్టి ఆత్మకూర్ గ్రామ శివారులో ఓ వ్యక్తిని కర్రలతో కొట్టి దారుణంగా హత్యచేశారు. ఈ కేసులో నలుగురు నిందితులు, బాల నేరస్థుడిని బుధవారం గద్వాల్ (Gadwal) రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన మోటార్ సైకిళ్లు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు గద్వాల డీఎస్పీ వై. మొగులయ్య తెలిపారు. ఈ మేరకు హత్య కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. ​శెట్టి ఆత్మకూర్ గ్రామానికి చెందిన గుంటిపల్లి రాజు(42) అనే వ్యక్తి ఈనెల 10న గ్రామానికి చెందిన కృష్ణయ్య గౌడ్ పొలం వద్ద బోరు వేస్తుండగా చూసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో పాత కక్షలను మనసులో ఉంచుకున్న ప్రత్యర్థులు కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. రక్తగాయాలైన రాజును గద్వాల్ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమద్యలో మృతి చెందాడు. మృతుడి సోదరుడు గుంటిపల్లి రాజేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గద్వాల్ రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మృతుడు గుంటిపల్లి రాజుకు, అదే గ్రామానికి చెందిన ఆంజనేయులు భార్య సైదమ్మతో గతంలో అక్రమ సంబంధం ఉందని ఆరోపణలున్నాయి. 2017లో గుంటిపల్లి రాజు గొడ్డలితో దాడి చేయడంతో ఆంజనేయులు మృతి చెందాడు. ఆ కేసులో రాజుకు కోర్టు 10 ఏండ్ల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత రాజు బెయిల్ పై బయటకు వచ్చాడు. తండ్రిని చంపిన రాజుపై కక్ష పెంచుకున్న ఆంజనేయులు కుమారులు (బాల నేరస్థుడు), వారి బంధువులు కలిసి ఈనెల 10న ఒంటరిగా దొరికిన రాజును కర్రలతో కొట్టి చంపేశారు. ఈ హత్య కేసులో దొబ్బలి లోకేశ్, దొబ్బిలి విజయ్ కుమార్, గోవర్ధన్, దొబ్బిలి శ్రీరాములు, ​బాల నేరస్థుడ్ని పోలీసులు అరెస్టు చేశారు.

గట్టు మండల కేంద్రంలో వెండి, బంగారం స్వాధీనం

గట్టు మండల కేంద్రంలో ఓ ఇల్లు రిపేర్ చేస్తుండగా బయటపడిన పురాతన వెండి నాణాలను, బంగారు ముక్కను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గద్వాల డీఎస్పీ వై. మొగులయ్య బుధవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ​ఈ నెల5, 6 తేదీల్లో శామ్‌సుందర్ (జోషి) అనే పురోహితుడి ఇంట్లో ప్రహరీ పనులు జరిగాయి. కూలీలు తవ్వకాలు జరిపించారు. ఈ క్రమంలోనే వారికి కొన్ని పురాతన నాణాలు లభ్యమయ్యాయి. ​నిధి దొరికిన విషయాన్ని బయటకు తెలియకుండా కూలీలు పంచుకున్నట్లు సమాచారం. పుకార్ల ఆధారంగా గట్టు తహసీల్దార్ ప్రాథమిక విచారణ జరిపారు. వెండి నాణాలు దొరికిన మాట వాస్తవమేనని తేలింది. వారి వద్ద నుంచి 33 పురాతన వెండి నాణాలను, ​9.5 గ్రాముల బంగారు ముక్క స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తహసీల్దార్ ఫిర్యాదు మేరకు ప్రభుత్వ ఖజానాకు (Treasury) తరలిస్తున్నట్లు వివరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>