కలం, వెబ్ డెస్క్: సింగరేణి కార్మికుల కష్టాలపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) కీలక వ్యాఖ్యలు చేశారు. సింగరేణి మెడికల్ బోర్డు (Singareni Medical Board)కు సంబంధించి రేవంత్ సర్కార్ స్పష్టమైన ప్రకటన చేయాలని.. లేదంటే ఈ నెల 20 తారీఖు నుంచి తాను నిరవధిక దీక్ష చేపడతానని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.
సింగరేణిలో కార్మికులకు డిపెండెంట్ ఉద్యోగాలు హక్కు భుక్తంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. మెడికల్ బోర్డు కచ్చితంగా నెలకు ఒకసారి పెట్టాలని డిమాండ్ చేశారు.సింగరేణి కార్మికులు ఎముకలు వంకర పోయే వరకు సమాజానికి సేవ చేస్తారని కొనియాడారు. అందుకే వాళ్లు అనుకున్న వాళ్లకు డిపెండెంట్ ఉద్యోగం ఇచ్చుకునే హక్కు ఉండాలన్నారు.
ఆందోళన చెందవద్దు..
రిటైర్ మెంట్ కు దగ్గరలో ఉన్న కార్మికులు (Singareni Employees) ఆందోళన చెందవద్దని కవిత భరోసా కల్పించారు. డిపెండెంట్ ఉద్యోగాల కోసం కార్మికులు పెట్టుకున్న రోజునే ప్రామాణికంగా తీసుకునేలా పోరాటం చేస్తామని తెలిపారు. ఇప్పుడు గెలిచిన సంఘాలు డిపెండెంట్ ఉద్యోగాలను గంగలో కలుపుతున్నా ఏమి ప్రశ్నించడం లేదని దుయ్యబట్టారు.
ఇటీవల తాము బాయిబాట పేరుతో సింగరేణి కార్మికులను కలవటంతో అన్ని పార్టీల వాళ్లు సింగరేణి వాళ్ళ దగ్గరికి వస్తున్నారని చెప్పారు. కానీ ఆ పార్టీల వాళ్లు డిపెండెంట్ ఉద్యోగాలకు సంబంధించి మెడికల్ బోర్డు అడగటం లేదని దుయ్యబట్టారు. తన దీక్షా ప్రకటనతో ప్రభుత్వం లీకులు ఇస్తోందని.. కానీ ఒక్కసారి మాత్రమే మెడికల్ బోర్డు పెట్టి వదిలేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పెండింగ్ లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగాలన్నీ క్లియర్ అయ్యే వరకు నెలకు రెండుసార్లు మెడికల్ బోర్డు పెట్టాలని కవిత (Kavitha) డిమాండ్ చేశారు.
Read Also: విద్యా శాఖను అందుకే నా దగ్గర పెట్టుకున్నా: సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On: Sharechat

