కలం, వెబ్ డెస్క్: ఢిల్లీ పర్యటనలో భాగంలో అక్కడి మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీకి అవకాశం లేదని కొట్టిపారేశారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 420 హామీల్లో ఒక్కటికూడా అమలు చేయలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ఛాన్సే లేదన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.
ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పరిశ్రమను పునఃప్రారంభించాలని తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రయత్నించామని.. కానీ అప్పుడు బీజేపీ ప్రభుత్వం సహకరించలేదని అన్నారు. ఇప్పుడు కేంద్ర మంత్రి కుమారస్వామిని కలిశాక ఇండస్ట్రీపై ఆశలు చిగురించాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే సీసీఐను పునఃప్రారంభిస్తామని ఆయన అన్నారు.
Read Also: వాళ్లది వ్యూహమా.. మౌనమా..?
Follow Us On: Instagram

