కలం, వెబ్ డెస్క్: ఏపీ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో (Mudragada Funeral) వివాదం చోటుచేసుకుంది. ముద్రగడ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు వీలు లేదని వైసీపీ నేతలు పోలీసులలను అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ (YSRCP) మాజీ మంత్రి అంబటి రాంబాబు.. అధికారికంగా ప్రభుత్వం అంతక్రియలు జరపడానికి వీల్లేదని స్పష్టం చేశారు. పోలీసులు అక్కడినుంచి వెళ్లిపోవాలని వైసీపీ అనుచరులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ పోలీసులకు, వైసీపీ అనుచరుల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది.

