జగిత్యాలలో వనమహోత్సవానికి సన్నాహాలు

కలం, జగిత్యాల : జగిత్యాల(Jagtial) పట్టణంలోని గొల్లపల్లి రోడ్డులో ఉన్న ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఈ నెల 17న వనమహోత్సవ (Vana Mahotsavam) కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇస్కా ఫౌండేషన్ – రోటరీ క్లబ్ జగిత్యాల ఆధ్వర్యంలో పండ్ల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు బుధవారం స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్ అరవ లక్ష్మిరాజు, భారత్ సురక్ష సమితి నాయకులు ఏసీఎస్ రాజు, ఇస్కా ఫౌండేషన్ – రోటరీ క్లబ్ ప్రతినిధులు మంచాల కృష్ణ, సిరిసిల్ల శ్రీనివాస్‌లు కళాశాల ప్రాంగణాన్ని పరిశీలించి అవసరమైన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.

వారితో పాటు మున్సిపల్ ఎన్విరాన్‌మెంట్ ఇంజనీర్ శ్రీకాంత్, వార్డ్ ఇన్‌చార్జి చందు, కళాశాల ప్రిన్సిపాల్ అలియా మక్సూర్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ తిరుపతి రెడ్డి, అధ్యాపకులు కె. తిరుపతి, ఎస్. సునీత పాల్గొన్నారు. ఈ నెల 17న జరిగే వనమహోత్సవ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి, ఇస్కా ఫౌండేషన్ – రోటరీ క్లబ్ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొంటారని వార్డ్ కౌన్సిలర్ అరవ లక్ష్మిరాజు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>