ఆసుపత్రి నుంచి పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్.. మరికొన్ని రోజులు రెస్ట్!

కలం, వెబ్ డెస్క్ : జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ముంబైలోని ఆసుపత్రి నుంచి డిశ్చార్చ్ అయ్యారు. ఈ నెల 10న ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో ఆయన కుడి భుజానికి విజయవంతంగా సర్జరీ జరిగింది. ఆపరేషన్ అనంతరం వైద్యుల సూచనల మేరకు ఆయన నాలుగు రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండి చికిత్స, విశ్రాంతి తీసుకున్నారు.

బుధవారం ముంబై ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హైదరాబాద్ లోని తన నివాసానికి బయలుదేరారు. ఆయన పూర్తి స్థాయిలో కోలుకోవడానికి మరికొన్ని రోజుల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. దీంతో పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లోని తన నివాసంలోనే ఉంటూ మరికొన్ని రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోనున్నారు. ఈ విషయం తెలిసి జనసైనికులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఆయన త్వరగా కోలుకుని మళ్లీ ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నారు.

Read Also: అమరావతి ల్యాండ్ స్కామ్ కేసు.. సీఎం చంద్రబాబుకు భారీ ఊరట..!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>