పారాక్వాట్‌ను నిషేధించిన కేంద్రం.. మాజీ ఎంపీ వినోద్ హర్షం

కలం, కరీంనగర్: గడ్డి మందు పారాక్వాట్ (Paraquat)ను కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా నిషేధిస్తూ నేడు గెజిట్ విడుదల చేయడం పట్ల బీఆర్ఎస్ (BRS) నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ (Vinod Kumar) హర్షం వ్యక్తం చేశారు. గడ్డి మందు పారాక్వాట్ ను నిషేధించాలని గత ఏడాది కాలంగా సామాజిక సంస్థలు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తోపాటు ప్రముఖ వైద్యులు మహేష్ రెడ్డితో కలిసి ఆందోళన నిర్వహిస్తున్న తమకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం సంతోషాన్ని కలిగించిందని పేర్కొన్నారు. తమ పోరాట ఫలితంగా కొన్ని నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం కూడా గడ్డి మందు పారా క్వాట్ ను నిషేధించిన విషయం కూడా తమకు సంతోషాన్ని కలిగించిందని వినోద్ కుమార్ తెలిపారు. దేశంలోని యావత్ రైతాంగానికి, ప్రజలకు ఇది ఎంతో మేలు చేకూరుస్తుందని వినోద్ కుమార్ అన్నారు. గడ్డి మందు పారాక్వాట్ నిషేధించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>