కలం, చండూరు: ప్రతి నీటి బొట్టు పొదుపుగా వినియోగించుకోవాలని, ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణలో భాగస్వాములు కావాలని మున్సిపల్ కమిషనర్ ఎల్.మల్లేశం అన్నారు. మంగళవారం చండూరు (Chandur) మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జల్ శక్తి అభియాన్- 2026 కార్యక్రమంలో భాగంగా నీటి సంరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ పాల్గొని ఇంకుడు గుంతల ప్రాముఖ్యత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
పర్యావరణ పరిరక్షణలో..
చండూరు (Chandur) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోటీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్నప్పటి నుంచే నీటి సంరక్షణ అలవాట్లను పెంపొందించుకోవాలన్నారు. తద్వారా పర్యావరణ పరిరక్షణలో తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. కొత్తగా నిర్మాణంలో ఉన్న ఇళ్లను పరిశీలించి ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
అనంతరం నీటి సంరక్షణ పై ఉపన్యాసం ఇచ్చిన విద్యార్థులకు బహుమతులు అందించారు. మున్సిపల్ మేనేజర్ జి.రాములు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ (టీపిఎస్) కె. అంజయ్య, వార్డు ఆఫీసర్ బి. సాయిరాం, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ అరవింద్ రెడ్డి, మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు.
Read Also : సీఎం రేవంత్ రెడ్డికి రెండు ఓట్లు.. ఈసీ కీలక ప్రకటన
Follow Us On: Instagram

