కలం, కరీంనగర్: ఆటోలో మర్చిపోయిన పర్సు, మొబైల్‌ను ట్రేస్ చేసి కరీంనగర్ 2 టౌన్ పోలీసులు (Karimnagar Police) బాధితుడికి అప్పగించారు. మంగళవారం ముప్పిడి రాకేష్ రాంనగర్ నుండి గీతాభవన్ వైపు ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో తన పర్సు, మొబైల్ ఫోన్‌ను ఆటోలో మర్చిపోయారు. అనంతరం తన వస్తువులు కనిపించకపోవడంతో కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఇన్‌స్పెక్టర్ సృజన్ రెడ్డి వెంటనే స్పందించి, పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేసి మొబైల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా ట్రేస్ చేయాలని ఆదేశించారు.
ఈ మేరకు పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం, మొబైల్ లొకేషన్ సహాయంతో ఫోన్‌ను ట్రేస్ చేసి పర్సు, మొబైల్ ఫోన్‌ను గుర్తించారు. అనంతరం వాటిని సురక్షితంగా బాధితుడు ముప్పిడి రాకేష్ కు అప్పగించారు. తన వస్తువులు తిరిగి లభించడంతో ముప్పిడి రాకేష్ సంతోషం వ్యక్తం చేస్తూ, వెంటనే స్పందించి తన పర్సు, మొబైల్‌ను గుర్తించి అందజేసిన కరీంనగర్ 2 టౌన్ పోలీసులకు (Karimnagar Police) కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటనలో చొరవ చూపి వస్తువులను ట్రేస్ చేయడంలో పాల్గొన్న ఎస్ఐ శ్రీనాథ్, సీడీఆర్ ప్రదీప్, కానిస్టేబుల్ సాయికిరణ్‌లను 2 టౌన్ ఇన్‌స్పెక్టర్ సృజన్ రెడ్డి అభినందించారు.
Read Also: గంభీర్-అగార్కర్ మధ్య విభేదాలున్నాయా?
Follow Us On: X(Twitter)

