రామంతాపూర్‌లో 16 ఎక‌రాల క‌బ్జా.. రంగంలోకి హైడ్రా!

క‌లం, వెబ్ డెస్క్‌: చెరువుల ఆక్రమణలపై హైడ్రా (HYDRAA) ఉక్కుపాదం మోపుతోంది. నేడు రామంతాపూర్ (Ramanthapur) ప‌రిధిలోని పెద్ద చెరువులో ఆక్రమణకు గురైన భూములను హైడ్రా కాపాడింది. రామంతాపూర్ పెద్ద చెరువు ఎప్‌టీఎల్ విస్తీర్ణం 30 ఎక‌రాలుగా ఉంది. ఇందులో 16 ఎక‌రాల వ‌ర‌కూ క‌బ్జాకు గురైంది. కబ్జాకు గురైన 16 ఎకరాల్లో 12 ఎక‌రాల్లో శాశ్వ‌త క‌ట్ట‌డాలు నిర్మించారు. అయితే అధికారులు వాటిపై చర్యలు తీసుకోలేదు.

మరో నాలుగు ఎక‌రాల మేర తాత్కాలిక షెడ్లు, గుడిసెలు ఉండగా వాటిని తొలగించి వారికి డ‌బుల్‌బెడ్ రూం ఇళ్లు మంజూరుకు అధికారులు సిఫార‌సు చేశారు. హైడ్రా మొత్తం 18 ఎక‌రాల మేర చెరువును అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ క్ర‌మంలో 1900 గ‌జాల మేర జీ ప్ల‌స్ 2 నిర్మాణంలో ఉన్న వాణిజ్య భ‌వ‌నంతో పాటు 280 గ‌జాల మేర ఉన్న ఆటో గ్యారేజీని కూడా తొల‌గించింది. హైడ్రా ప్రస్తుతం రూ.19 కోట్లతో రామంతాపూర్ పెద్ద‌ చెరువు అభివృద్ధి పనులు చేపట్టనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>