‘ఛలో సచివాలయం’ భగ్నం.. వామపక్ష విద్యార్థి సంఘాల నాయకుల అరెస్ట్

కలం, నిర్మల్: పెండింగ్‌లో ఉన్న రూ. 10,500 కోట్లకు పైగా స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఎఫ్ వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ‘ఛలో సచివాలయం’ (Chalo Secretariat Protest) కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. ఈ కార్యక్రమానికి వెళ్తున్న వామపక్ష విద్యార్థి సంఘాల నేతలను నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా ఉద్యమాలను అణచివేయడం సరికాదని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, సర్టిఫికెట్ల కోసం విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించాలని , విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్ దిగంబర్, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు సింగారి వెంకటేష్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి కైలాస్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>