నేపాల్‌లో మళ్లీ ‘జెన్-జీ’ విప్లవం.. ప్రధాని రాజీనామాకు డిమాండ్!

కలం, వెబ్ డెస్క్ : నేపాల్ రాజధాని ఖాట్మండు మెట్రోపాలిటన్ పోలీసుల అత్యుత్సాహం ఓ సామాన్య యువకుడి ప్రాణాలు బలిగొంది. బైక్‌కు లాక్ వేసి జరిమానా విధించిన ఘటన ఓ నిరుద్యోగి ఆత్మహత్యకు దారి తీసింది. దీంతో గతంలో ప్రభుత్వాన్ని కూల్చేసిన ‘జెన్-జీ’ (Nepal Gen Z Protest ) యువతి మళ్లీ వీధుల్లోకి పోరు బాట పట్టారు. తాము గెలిపించుకున్న ప్రధాని బాలెన్ షా రాజీనామా చేయాలంటూ ‘జెన్-జీ’ యువత వీధుల్లోకి రావడం దేశంలో తీవ్ర సంచలనంగా మారింది.

అసలేం జరిగిందంటే..

ఈ నెల 9వ తేదీన ఖాట్మండులోని పాస్‌పోర్ట్ ఆఫీస్ బయట ఓపెన్ ప్లేస్‌లో గణేష్ నేపాలి (25) అనే యువకుడు తన బైక్‌ను పార్క్ చేశాడు. అక్కడికి చేరుకున్న ఖాట్మండు మెట్రోపాలిటన్ పోలీసులు.. పార్కింగ్ నిబంధనలు ఉల్లంఘించాడంటూ అతని బైక్‌ను లాక్ చేశారు. అంతేకాకుండా అతనికి వెయ్యి నేపాలీ రూపాయల జరిమానా విధించారు. ఈ క్రమంలోనే గణేష్‌కు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు తనను అవమానించారని తీవ్ర మనస్తాపానికి గురైన గణేష్.. అందరూ చూస్తుండగానే తనపై పెట్రోలో పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు మంటలు ఆర్పేసి అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాలపాలైన అతడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

‘జెన్-జీ’ యువతలో ఆగ్రహజ్వాలలు

గణేష్ ఆత్మహత్య, దానికి దారితీసిన పరిస్థితులకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. దీంతో నేపాల్ వ్యాప్తంగా ఉన్న ‘జెన్-జీ’ యువతలో ఆగ్రహజ్వాలలు ఎగిసిపడ్డాయి. ‘జెన్-జీ’ యువకులు పెద్ద ఎత్తున్న వీధుల్లోకి వచ్చి నిరసన (Nepal Gen Z Protest ) ప్రదర్శనలు చేపట్టారు. తమ మద్ధతులో అధికారంలోకి వచ్చిన ప్ధాని బాలెన్ షా ఇలాంటి కఠినమైన నిబంధనలతో సామాన్యుల పొట్ట కొడుతున్నారని , ప్రజల ప్రాణాలు తీస్తున్నారని వారు ఆరోపించారు. ప్రధాని వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

దిగివచ్చిన ప్రభుత్వం.. పోలీసుల సస్పెన్షన్

యువత ఆందోళనలు ఉధృతం కావడంతో నేపాల్ ప్రభుత్వం దిగివచ్చింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కోసం వెంటనే 5 గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. అలాగే, యువకుడి మృతికి కారణమైన ఈ ఘటనలో ప్రమేయం ఉన్న పోలీసులను విచారణ పూర్తయ్యేదాకా సస్పెండ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. అయినప్పటికీ నేపాల్‌లో యువత నిరసనల సెగలు ఇంకా చల్లారడం లేదు. ఈ పరిస్థితి ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని అక్కడి ప్రభుత్వంలో టెన్షన్ పట్టుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Read Also: అయోధ్య విరాళాల కేసు.. ‘సిట్’కు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

Read Also: జెన్ జీ విటర్స్ గేమ్ ఛేంజర్స్ 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>