కలం, కరీంనగర్ బ్యూరో: పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌కు చెందిన వర్షిత్ సనమల్ల కరీంనగర్ (Karimnagar) జిల్లా చొప్పదండి జవహర్ నవోదయ విద్యాలయంలో చదువుతున్నాడు. సాహిత్య ప్రతిభతో వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. సోమవారం కలెక్టర్ చిత్రాను కలవగా అభినందించారు. చిన్న వయస్సులోనే తెలుగు, ఆంగ్ల భాషల్లో ద్విభాషా పాటలు, కవితలు రచించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడంపై ప్రశంసించారు.
2026 జూన్ 4న వరల్డ్‌వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి ప్రశంసా పత్రం అందుకోవడం అరుదైన విజయమని పేర్కొన్నారు. ఇలాంటి విజయాలు ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తాయని కలెక్టర్ అన్నారు. నవోదయ ప్రిన్సిపల్ బ్రహ్మానంద రెడ్డి, వర్షిత్ తల్లిదండ్రులు ప్రేమ్ కుమార్, సుమలత పాల్గొన్నారు.

