కలం, వెబ్ డెస్క్ : టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్లు అయిన శేఖర్ మాస్టర్ (Shekar), జానీ మాస్టర్ (Jani Master) ల మధ్య గొడవ జరిగిందనే ప్రచారంపై జానీ మాస్టర్ క్లారిటీ ఇచ్చారు. శేఖర్ మాస్టర్ ఎలాంటి అపార్థాలు లేదా విభేదాలు లేవని స్పష్టం చేశారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, నివేదికలను ఖండిస్తూ జానీ మాస్టర్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.
తామంతా ఒక కుటుంబం అని ఎప్పుడూ ఒకరికొకరం అండగా నిలబడుతుంటాం అని జానీ మాస్టర్ పేర్కొన్నారు. తమ మధ్య గొడవ జరిగిందంటూ వస్తున్న వార్తల తరువాత మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఇద్దరితో సెట్స్‌పై మాట్లాడి, సమస్యలను పరిష్కరించారని తెలిపారు. ఆ తర్వాత ముగ్గురం కలిసి సమయం గడిపి, భోజనం చేశారని తెలిపారు.
ఈ క్రమంలో జానీ మాస్టర్ విడుదల చేసిన ఫోటోల్లో.. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ నవ్వుతూ భోజనం చేస్తూ కనిపించారు. వారితో చిరంజీవి కూడా ఉన్న ఫోటోలను కూడా చూడొచ్చు. తమపై వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, ప్రేమ, గౌరవం, సానుకూలతతో ముందుకు సాగాలని జాని మాస్టర్ కోరారు.

