విద్యార్థులకు న్యాయం చేయాలి.. కలెక్టరేట్ ఎదుట పేరెంట్స్ ధర్నా

కలం, నిర్మల్ : బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకంలో (Best Available School Scheme) మరిన్ని పాఠశాలలను చేర్చి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం నిర్మల్ (Nirmal) కలెక్టరేట్ ఎదుట ఎంపికైన విద్యార్థుల తల్లిదండ్రులు, దళిత సంఘాల నాయకులు ఆందోళన నిర్వహించారు.

ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో జిల్లాలో ఈ పథకం కింద సేవలు అందిస్తున్న విజయ, రవి స్కూల్ వైదొలిగిందని, ప్రస్తుతం వశిష్ట స్కూల్‌లో మాత్రమే ఈ పథకం కొనసాగుతోందని తెలిపారు. ఇటీవల ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 101 మంది విద్యార్థులను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశారని, అయితే వారందరినీ ఒకే పాఠశాలలో చేర్పించడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్న ఇప్పటివరకు జిల్లా కలెక్టర్ (Nirmal Collector) ఎలాంటి చర్య తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యపై ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేస్తున్నప్పటికీ ఎలాంటి పరిష్కారం లభించలేదని అన్నారు. వెంటనే అధికారులు స్పందించి మరో రెండు పాఠశాలలను బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకంలో చేర్చి విద్యార్థులకు ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

Read Also: భద్రాచలం వారధి.. గుండెలను పిండేసే కన్నీటి కథకు 62 ఏళ్ళు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>