కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లాలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. తానూరు మండలం బోరిగావ్ గ్రామ సర్పంచ్ (Borigaon Sarpanch) పల్లె జ్యోతి సోమవారం తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సర్పంచ్ మరణవార్త తెలియడంతో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు, ఆమె ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. అయితే జ్యోతి బలవన్మరణానికి గల అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also : గజ్వేల్ కాంగ్రెస్లో ‘రెబెల్’ మంటలు..పీసీసీ చీఫ్ వర్సెస్ తూంకుంట
Follow Us On: Instagram

