మెదక్‌లో విషాదం: నిద్రిస్తున్న కుటుంబంపై పాము దాడి.. చివరకు!

కలం, మెదక్ బ్యూరో: మెదక్ (Medak) జిల్లా చిన్న శంకరం పేట మండలం మల్లుపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. పొన్నబోయిన నాగరాజు తన భార్యాపిల్లలతో నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి చొరబడిన పాము, ఆయన భార్యతో పాటు చిన్నారి కూతురు హారికను కూడా కాటేసింది (Snake Attack). ఈ విషయాన్ని నాగరాజు గానీ, ఆయన భార్య గానీ గుర్తించలేదు. అయితే తల్లి లావణ్యకు రక్తం రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను నార్సింగ్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కూతుర్ని కూడా ఆసుపత్రికి రమ్మని తండ్రి చెప్పగా.. హారిక రాకుండా సమీప బంధువుల ఇంటి దగ్గరే ఉన్నది. అయితే చిన్నారి హారిక స్పృహ తప్పిపోవడంతో పాప బంధువులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలపడంతో పాపను ఇంటికి తీసుకువచ్చారు. నాగరాజు కుటుంబం కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. నాగరాజుకు సొంత ఇల్లు లేక పూరి గుడిసెలో నివసిస్తున్నాడని, నాగరాజు కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

చిన్నారి హారిక మల్లు పల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మూడవ తరగతి చదువుకుంటుంది. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. పాము కాటు వేయగా తన భార్య లావణ్యకు రక్తం రావడంతో గమనించి ఆసుపత్రికి తీసుకెళ్లామని, పాపను తెల్లారి ఆసుపత్రికి తీసుకెళ్లడంతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని ఆవేదన వ్యక్తం చేశాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>