చైనా తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీలో భానుడి భగభగలు!

కలం, వెబ్ డెస్క్ : ఏపీ ప్రజలకు అమరావతి వాతావరణ శాఖ షాకింగ్ న్యూస్ చెప్పింది. చైనాను వణికిస్తున్న తుఫాను ప్రభావం ఇప్పుడు భారత్‌లో రుతుపవనాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ తుఫాన్ కారణంగా భారత్ వైపు రావాల్సిన తేమగాలుల తీవ్రత గణనీయంగా తగ్గిపోయిందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. చైనా తుఫాన్ వల్ల వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా బంగాళాఖాతంలో అల్పపీడనాల ఏర్పాటుకు తీవ్ర ఆటంకం ఏర్పడిందని, దీని ప్రభావంతో ఏపీలో ఎండల తీవ్రత (AP Heatwave) పెరిగిపోయిందని వివరించింది.

దీంతో రుతుపవనాల గమనం మందగించి, వర్షాలు మొహం చాటేశాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ క్రమంలోనే ఏపీలో ఒక్కసారిగా మారిపోయిందని తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు జిల్లాల్లో మళ్లీ ఎండలు మండిపోతున్నాయని చెప్పుకొచ్చింది. తిరుపతిలో నిన్న అత్యధికంగా 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని వెల్లడించింది. రాగల మరో కొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని, ప్రజలు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>