కలం, చండూరు: ప్రతి ఉద్యోగికీ పదవీ విరమణ తప్పనిసరని చండూరు (Chandur) మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు. 13 సంవత్సరాలుగా చండూరు గ్రంథాలయ పాలకుడిగా పనిచేస్తున్న యుగంధర్ ఆదివారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ.. 2012 నుంచి చండూర్‌లోనే విధులు నిర్వర్తించారని, గ్రంథాలయ అభివృద్ధికి తోడ్పాటు అందించారన్నారు.
ఈ సందర్భంగా యుగంధర్ దంపతులను తోటి ఉద్యోగులు, పలువురు నేతలు శాలువాలు, పూలమాలతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ బూతరాజు దశరథ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐతరాజు మల్లేష్, నూతన గ్రంథాలయ పాలకులు నర్మదా, లాల్ మహమ్మద్, ఉపాధ్యాయులు సుధాకర్, పంచాయతీ సెక్రటరీ కిరణ్, సరికొండ వెంకన్న పాల్గొన్నారు.

