గద్వాల జిల్లాలో దారుణం.. వృద్ధురాలి హత్య

కలం, జోగుళాంబ గద్వాల: జోగుళాంబ గద్వాల జిల్లాలో వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. గద్వాల (Gadwal) పట్టణం బీసీ కాలనీలో నివసిస్తున్న శంకరమ్మ(59)పై మధ్యాహ్న సమయంలో ఆమె సమీప బంధువు మేకల రామంజి దాడికి తెగబడ్డాడు. వెంట తెచ్చుకున్న కత్తితో శంకరమ్మను తీవ్రంగా పొడవడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందింది.

హత్య అనంతరం మేకల రామంజి గద్వాల పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. శంకరమ్మకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

ఆస్తి వివాదమే కారణమా..?

మృతురాలు శంకరమ్మ, మేకల రామాంజి కుటుంబాలకు మధ్య గతంలో ఆస్తి వివాదం ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. హత్య చేసేందుకు అదే కారణంగా చర్చించుకుంటున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం గద్వాల జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: పాట ఏదైనా.. జానకి గొంతులో మాధుర్యమై!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>