కలం, వెబ్ డెస్క్: తన గాన మాధుర్యంతో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న లెజెండరీ సింగర్, నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా, గాన కోకిల ఎస్ జానకి (Singer Janaki) తన సంగీత ప్రస్థానంలో అనేక అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు. ఉత్తమ నేపథ్య గాయనిగా 4 సార్లు జాతీయ చలన చిత్ర అవార్డులను అందుకున్నారు.
ఏపీ ప్రభుత్వం నుంచి 12నంది అవార్డులతోపాటు వివిధ దక్షిణాది రాష్ట్రాల నుంచి 30కి పైగా అవార్డులు సాధించారు. 2013 ఆమెకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. అయితే దక్షిణాది కళాకారులకు గుర్తింపు ఆలస్యంగా వస్తుందని నిరసిస్తూ పురస్కారాన్ని గౌరవపూర్వకంగా జానకి (Singer Janaki) తిరస్కరించారు.
1977లో ఉత్తమ నేపథ్య గాయనిగా తమిళంలో, 1981లో ఉత్తమ నేపథ్య గాయనిగా మళయాళంలో, 1992లో ఉత్తమ నేపథ్య గాయనిగా తమిళంలో జాతీయ అవార్డులు అందుకోగా.. 1984లో ఉత్తమ నేపథ్య గాయనిగా తెలుగు పాట సితార సినిమాలోని “వెన్నెల్లో గోదారి అందం” పాటకు జాతీయ పురస్కారాలు స్వంతం చేసుకున్నారు. ఇక 1986లో కలైమామణి, 1997లో ఫిలింఫేర్ దక్షిణ భారత సాహిత్య అవార్డు 2002లో ఎచీవర్ అవార్డు అందుకున్నారు.
2005లో స్వరాలయ జేసుదాసు ప్రత్యేక పురస్కారం, 2009లో గౌరవ డాక్టరేట్, 2011లో కర్నాటక బసవభూషణ్ అవార్డు, 2012లో నిత్యనూతన గాత్రంగా విజయా మ్యూజికల్ అవార్డు, 2013లో మా మ్యూజిక్ జీవిత సాఫల్య అవార్డు, 2015లో సైమా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు, 2017లో సేఫ్ – వేటూరి జీవిత సాఫల్య పురస్కారం, వీటితోపాటు తమిళనాడు సినీ అవార్డులు 7, ఒరియా సినీ అవార్డుల్లో ఉత్తమ నేపథ్య గాయనిగా, కేరళ రాష్ట్ర ఉత్తమ గాయనిగా 11 అవార్డులు సాధించారు.
Read Also: ప్రముఖ గాయని ఎస్. జానకి కన్నుమూత
Follow Us On: Instagram

