పాట ఏదైనా.. జానకి గొంతులో మాధుర్యమై!

కలం, వెబ్ డెస్క్: గాన కోకిల ఎస్.జానకి (Singer S Janaki) తన శ్రోతలను శోకసంద్రంలో ముంచుతూ కన్నుమూశారు. తన కెరీర్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సహా అనేక భాషల్లో సుమారు 50 వేలకు పైగా పాటలు పాడి ‘నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా’గా ఖ్యాతి గడించారు. ఆమె పాడిన పాటలు ఇప్పటికీ మారుమోగుతూనే ఉంటున్నాయి.

ఆల్ టైం హిట్ సాంగ్స్ ఇవే..

సిరిమల్లె పువ్వా (పదహారేళ్ల వయస్సు), మౌనమేలనోయి (సాగర సంగమం), వెన్నెల్లో గోదారి అందం (సితార), మాటే మంత్రము (సీతాకోక చిలుక), ప్రియతమా నా హృదయమా (ప్రేమ), జాబిల్లి కోసం ఆకాశమల్లే (మంచి మనసులు), ఏ దివిలో విరిసిన పారిజాతమో (కన్నె వయసు), సందెపొద్దుల కాడ (అభిలాష), నడక కలిసిన నవరాత్రి (శంకరాభరణం) వంటి వందల మధురమైన పాటలున్నాయి.

విభిన్న పాటలతో..

భక్తి, మెలోడీ, జానపదం, ప్రేమ, విరహ, విషాద గీతాలు.. ఏవైనా ఆమె గొంతులో మాధుర్యమై బయటకు వచ్చాయా.. అని అనిపించేవి. కొన్ని తరాలు ఆమె పాటలకు పులకించిపోయారు. ఇళయరాజా, ఎస్పీ బాలసుబ్రమణ్యం, ఎస్.జానకి కాంబినేషన్ అంటే.. హిట్ అన్నట్లు ఉండేది. అందుకు తగ్గట్లుగానే అవన్నీ క్లాసిక్ పాటలుగా నిలిచిపోయి.. ఇప్పటికీ జనాలను అలరిస్తూనే ఉన్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>