వియ‌త్నాం బోటు ప్ర‌మాదం.. మృతుల వివ‌రాలు విడుద‌ల‌

క‌లం, వెబ్ డెస్క్‌: వియత్నాం (Vietnam)లోని ఫుక్ క్వాక్ దీవి స‌మీపంలో జరిగిన బోటు ప్రమాదం (Boat Accident) తీవ్ర విషాదాన్ని మిగిలించింది. ఈ ఘ‌ట‌న‌లో భార‌త్‌కు చెందిన ప‌లువురు టూరిస్టులు మృతి చెందిన విష‌యం తెలిసిందే. వీరిలో తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడుకు చెందిన వారున్నారు. అయితే ప్ర‌మాదం జ‌రిగిన‌ప్ప‌టి నుంచి ఎంత మంది చ‌నిపోయారు, వారు ఏ రాష్ట్రానికి చెందిన వార‌న్న విష‌యాల‌పై ర‌క‌ర‌కాలు వార్త‌లు ప్ర‌చార‌మ‌య్యాయి. దీనిపై వియ‌త్నాంలోని భార‌త రాయ‌బార కార్యాల‌యం స్ప‌ష్ట‌త‌నిచ్చింది. ఈ ప్ర‌మాదంలో మృతి చెందిన వారి వివ‌రాల‌తో ఓ జాబితాను ఎక్స్ వేదిక‌గా వెల్ల‌డించింది.

ఈ ఘ‌ట‌న‌లో మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయిన‌ట్లు రాయ‌బార కార్యాల‌యం స్ప‌ష్టం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. బాధిత‌ కుటుంబాలకు ఎలాంటి స‌హాయ స‌హ‌కారాలు అందించేందుకైనా హనోయ్‌లోని భారత రాయబార కార్యాలయం, హో చి మిన్ సిటీలోని భారత కాన్సులేట్ అందుబాటులో ఉంటాయ‌ని హామీ ఇచ్చింది.

మృతుల వివ‌రాలివే..

ఈ బోటు ప్ర‌మాదంలో మృతి చెందిన వారిలో ఎక్కువ మంది త‌మిళ‌నాడు రాష్ట్రానికి చెందిన వారే ఉన్నారు. మృతి చెందిన 15 మందిలో 10 మంది త‌మిళ‌నాడుకు చెందిన వారు కాగా, ముగ్గురు ఏపీ, ఇద్ద‌రు కేర‌ళ‌కు చెందిన వారున్నారు. తమిళనాడుకు చెందిన వారిలో సెంథిల్ కుమార్ జయావెల్, మురుగ ప్రభు, శ్రీధర్ సుందర రాజన్, షేక్ అబ్దుల్లా, బాలాజీ నటేషన్, వినయ కుమార్, రవి శంకర్, సంతోష్ కుమార్, బాబు కుప్పుస్వామి, అలగురాజన్ శివస్వామి, నల్లపేట ఆది శేషయ్య ఉన్నారు. కేరళకు చెందిన వారిలో అవికాట్ చేరియాన్ థామస్, లోవేని థామస్ ఉన్నారు. ఇక ఏపీకి చెందిన వారిలో కడప జిల్లాకు చెందిన ముడియం శ్రీధర్, మచిలీపట్నానికి చెందిన గెల్లి జయ లక్ష్మి ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>