కలం, నిర్మల్ : ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Nirmal Collector) అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన సోన్, లక్ష్మణచందా మండలాల్లో పర్యటించి, జరుగుతున్న ఓటరు నమోదు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత కీలకమని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.
క్షేత్రస్థాయిలో బూత్ స్థాయి అధికారులు తప్పనిసరిగా ఇంటింటికీ వెళ్లి ఓటరు జాబితా సవరణకు సంబంధించిన ఫారమ్‌లను సేకరించాలని కలెక్టర్ (Nirmal Collector) స్పష్టం చేశారు. ఓటర్లు ఫారమ్‌లు నింపే సమయంలో అధికారుల సహకారం అందించాలని, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. బీఎల్ఓలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న కలెక్టర్ (Bhavesh Mishra), వాటిని వెంటనే పరిష్కరించేలా సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు. రోజువారీగా నిర్దేశించుకున్న లక్ష్యాలను నిర్ణీత సమయంలోపు పూర్తి చేయాలని సూచించారు. ఈ పర్యటనలో తహసిల్దార్లు సంతోష్, సరిత, స్థానిక ప్రజాప్రతినిధులు, ఎన్నికల విభాగం అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Read Also: సీఎం రేవంత్ ఎమోషనల్ పోస్ట్.. ఏమన్నారంటే!
Follow Us On: Instagram

