వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: డాక్టర్ స్వర్ణ రెడ్డి

కలం, వెబ్ డెస్క్ : వర్షాకాలంలో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని ఖానాపూర్ (Khanapur) ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ స్వర్ణ రెడ్డి సూచించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆమె మాట్లాడుతూ.. వర్షాకాలంలో కలుషితమైన నీరు, ఆహారం తీసుకోవడం వల్ల డయేరియా, టైఫాయిడ్, వైరల్ జ్వరాలు, డెంగీ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.

ప్రజలు తప్పనిసరిగా మరిగించిన, శుద్ధి చేసిన నీటినే తాగాలని, వేడిగా వండిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని డాక్టర్ స్వర్ణ రెడ్డి సూచించారు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, దోమలు పెరగకుండా పారిశుద్ధ్యాన్ని పాటించాలని అన్నారు. జ్వరం, దగ్గు, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే స్వయంగా మందులు వాడకుండా వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి వైద్యుల సలహా మేరకు చికిత్స పొందాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైన మందులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారని, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు డాక్టర్ స్వర్ణ రెడ్డి తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>