తిరుమల అలిపిరి నడకమార్గంలో చిరుత కలకలం

కలం, వెబ్ డెస్క్ : తిరుమల (Tirumala) అలిపిరి నడకమార్గంలో చిరుతపులి సంచారం తీవ్ర కలకలం రేపింది. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు అలిపిరి నడకమార్గంలో వెళ్లిన భక్తులకు లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలో చిరుతపులి కనిపించింది. దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన భక్తులు వెంటనే పరుగులు తీశారు.

అయితే చిరుత సంచారం సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని రాడ్లతో పెద్ద పెట్టున శబ్దాలు చేశారు. దీంతో చిరుత సమీప అడవిలోకి పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయం తెలిసి భక్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే అటవీశాఖ, సంబంధిత అధికారులు అలిపిరి నడకమార్గంలో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.

Read Also: ఘోర విమాన ప్రమాదం.. 10 మంది దుర్మరణం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>