కలం, నిర్మల్: ప్రభుత్వం వేతన ప్రాతిపదికన నియమించే వరకు రీ సర్వే విధుల్లో పాల్గొనబోమని లైసెన్స్డ్ సర్వేయర్లు (Licensed Surveyors) స్పష్టం చేశారు. శుక్రవారం నిర్మల్ (Nirmal) జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఏడాది క్రితం నియామక పత్రాలు అందుకున్నప్పటికీ ఇప్పటివరకు వేతనం అందలేదని, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.
ఇటీవల లైసెన్స్డ్ సర్వేయర్ బంగారయ్య గుండెపోటుతో మృతి చెందిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ప్రభుత్వం వెంటనే వేతనాలు చెల్లించి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా లైసెన్స్డ్ సర్వేయర్ల జిల్లా అధ్యక్షులు ఉదయ్, కార్యవర్గ సభ్యులు కైసర్, భీమేష్, రణధీర్, ప్రవీణ్, రాకేష్, సచిన్, అజయ్, అన్వేష్, రాజేష్, సాయి ప్రసాద్, చంద్రకాంత్, అరవింద్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

