మెద‌క్ జిల్లాలో బీజేపీ స‌ర్పంచ్‌కి బిగ్ షాక్‌!

క‌లం, వెబ్ డెస్క్‌: మెదక్ (Medak) జిల్లాలో భర్త ఆగడాలకు మ‌హిళా స‌ర్పంచ్ ప‌ద‌వికే గండం ఎదురైంది. ఏకంగా ఆమెను ఆరు నెల‌ల పాటు ప‌ద‌విలో నుంచి స‌స్పెండ్ చేస్తూ జిల్లా క‌లెక్ట‌ర్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. వివ‌రాల్లోకి వెళ్తే.. మెద‌క్ జిల్లాలోని చేగుంట మండ‌లం పొలంప‌ల్లి (Polampally) గ్రామానికి బీజేపీ (BJP) పార్టీకి చెందిన కొండి రాజ్య‌ల‌క్ష్మి స‌ర్పంచి (Sarpanch)గా ఉన్నారు. పేరుకు ఆమె స‌ర్పంచ్ అయినా హ‌వా అంతా భ‌ర్త‌దేన‌ని స్థానికంగా తీవ్ర ఆరోప‌ణ‌లున్నాయి.

భార్య ప‌ద‌విని అడ్డుపెట్టుకొని రాజ్య‌ల‌క్ష్మి భ‌ర్త స్వామి హ‌ద్దు అదుపు లేకుండా ప్ర‌వ‌ర్తిస్తున్నాడ‌ని ఫిర్యాదులు వ‌చ్చాయి. స్వామి హ‌రిత హారం మొక్క‌లు, పంచాయ‌తీ ఫ‌ర్నీచ‌ర్‌, టాయిలెట్స్ ధ్వంసం చేశాడ‌ని, పంచాయ‌తీకి ఇష్టం వ‌చ్చిన‌ప్పుడు తాళం వేస్తున్నాడ‌ని జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్‌కు ఫిర్యాదు అందింది. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన క‌లెక్ట‌ర్ సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మిని ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>