ప్రభుత్వ భూమిలో పెట్రోల్​ బంక్​.. సీజ్ చేసిన అధికారులు

కలం, జనగామ : జనగామ (Jangaon) జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు కొడకండ్ల మండలంలోని ప్రభుత్వ భూమిలో అనధికారికంగా నిర్మించిన ఐఓసీ పెట్రోల్ బంక్‌ను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. కొడకండ్ల గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 100/3లో 1,076 చదరపు గజాల విస్తీర్ణంలో అక్రమంగా నిర్మించిన పెట్రోల్ బంక్‌పై రెవెన్యూ డివిజనల్ అధికారి కిరణ్ ప్రకాష్ ఆధ్వర్యంలో శుక్రవారం చర్యలు చేపట్టారు.

తహసీల్దార్ సమక్షంలో మండల గీర్దావర్ పంచనామా నిర్వహించి, అనంతరం పెట్రోల్ బంక్‌ను అధికారికంగా సీజ్ చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని రెవెన్యూ అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వారు వెల్లడించారు.

Read Also: సుప్రీంకోర్టులో వ్యక్తి హల్చల్.. జడ్జిలు షాక్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>