కల్వకుంట్ల కుటుంబాన్ని పాతాళానికి తొక్కుతాం: సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్: వచ్చే ఎన్నికల్లో కల్లకుంట్ల కౌరవ కుటుంబాన్ని పాతాళానికి తొక్కుతామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పాపాల భైరవుడిని ఫాంహౌస్‌లో బంధించామని.. జరగబోయే కురుక్షేత్రంలో గెలిచేది తామేనన్నారు. ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో జరుగుతున్న రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ ప్రసంగించారు.

బీజేపీతో టచ్‌లోకి హరీశ్ రావు..

కల్వకుంట్ల కుటుంబంలో ఒకరంటే ఒకరికి పడదని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. హరీశ్ రావు బీఆర్ఎస్ పార్టీలో ఉంటాడో.. లేదో చెప్పాలన్నారు. ఆయన బీజేపీతో టచ్‌లో ఉన్నాడని.. కాదని రాముడి మీద ఒట్టేసి చెప్పగలరా.. అని సవాల్ విసిరారు.

44 గ్రామాలు కొట్టుకుపోతాయి..

కన్నెపల్లి పంపుహౌస్ మోటార్లు ఆన్ చేస్తే.. కింద ఉన్న భద్రాచలం సహా 44 గ్రామాలు కొట్టుకుపోతాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కరెంట్ సరఫరాకు మారుపేరని.. సందేహం ఉంటే బీఆర్ఎస్ నేతలు కరెంట్ తీగలు పట్టుకోవాలని సూచించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగుల కలలు నెరవేరలేదన్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రతి శాఖలో భారీగా ఉద్యోగాలిచ్చామన్నారు.

మధిరకు ఇంజినీరింగ్ కళాశాల మంజూరు..

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరినట్లుగా మధిర నియోజకవర్గానికి వెంటనే ఇంజినీరింగ్ కాలేజీ మంజూరు చేస్తున్నట్లు సీఎం రేవంత్ అన్నారు. ఇంత పెద్ద సభ పెట్టిన తరువాత.. అడిగితే ఎవరు మాత్రం కాదంటారని ఛలోక్తి విసిరారు. అసలే భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఆర్థిక మంత్రిగా ఉన్నారని, ఆయన కన్నెర్ర చేస్తే ప్రతిపక్షాలు భస్మం అవుతాయన్నారు.

Read Also: హరీశ్.. పదేళ్లు ఏం చేశావ్?: మహేశ్ కుమార్ గౌడ్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>