బాలయ్య ఫ్యాన్స్‌కు పూనకాలే.. మోక్షజ్ఞ కోసం రంగంలోకి సందీప్ వంగా!

కలం, వెబ్ డెస్క్: నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం కోసం నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఫిల్మ్ నగర్‌లో క్రేజీ వార్త జోరుగా ప్రచారం సాగుతోంది. మోక్షజ్ఞ మొదటి సినిమా కథకు టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) క్రియేటివ్ ఇన్‌పుట్స్ ఇస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సందీప్ వంగా మార్క్ క్రియేటివిటీ ఈ ప్రాజెక్ట్‌కు తోడవుతుందనే ప్రచారం ఫ్యాన్స్‌లో భారీ అంచనాలను పెంచేస్తోంది.

ఈ ప్రచారంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, ఒకవేళ ఇదే నిజమైతే మోక్షజ్ఞ లాంచ్ ఊహించని రేంజ్‌లో ఉంటుంది. సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయమని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలతో పాటు దర్శకుడి పేరును కూడా అధికారికంగా ప్రకటించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>