విద్యార్థిని ఆత్మహత్య.. బాన్సువాడ హాస్టల్​ వార్డెన్ సస్పెండ్

కలం, నిజామాబాద్ బ్యూరో : కామారెడ్డి జిల్లా బాన్సువాడ (Banswada) ఎస్సీ గర్ల్స్ హాస్టల్ వార్డెన్ మమతను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. హాస్టల్ లో జరిగిన విద్యార్థిని అమృత ఆత్మ హత్యపై అధికారులు విచారణ జరిపారు. వార్డెన్ మమత విధుల్లో నిర్లక్ష్యం వహించారని ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

అమృత కుటుంబానికి న్యాయం చెయ్యాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ చౌరస్తా వద్ద కుటుంబ సభ్యులు, బిఆర్ఎస్ నాయకులు రాస్తా రోకో నిర్వహించారు. వార్డెన్ ను సస్పెండ్ చేసి బాధిత కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందించాలని వారు డిమాండ్ చేశారు. అమృత ఆత్మహత్య పై విచారణ చేయించి కుటుంబానికి న్యాయం చేస్తామని ఆర్డీఓ రవీందర్ రెడ్డి, జిల్లా అధికారి వెంకటేష్ హామీ ఇవ్వడంతో రాస్తా రోకో ను విరమించారు.

Read Also: బీఆర్ఎస్‌కు భరోసా లేదు.. కేటీఆర్‌పై ఎంపీ చామల ఫైర్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>