పనికి వెళ్లి వచ్చేసరికి మేస్త్రి భార్య అదృశ్యం

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా సోన్ మండలం జాఫ్రాపూర్ గ్రామంలో ఓ వివాహిత అదృశ్యమైంది. ఎస్సై గోపీ వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా కాట్రగుంట గ్రామానికి చెందిన కండర నాగరాజు, ఆయన భార్య కండర మల్లేశ్వరి మూడు సంవత్సరాలుగా జాఫ్రాపూర్ గ్రామంలో నివాసం ఉంటున్నారు. కండర నాగరాజు మేస్త్రిగా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం నాగరాజు మేస్త్రి పనికి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పటికే ఆయన భార్య ఇంట్లో కనిపించలేదు. బంధువులు, పరిసర ప్రాంతాల్లో గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు. దీంతో శుక్రవారం సోన్ పోలీస్ స్టేషన్‌లో భర్త ఫిర్యాదు చేయగా, పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>