హీరో ఇంట్లోకి దూసుకెళ్లిన కారు: ఫిలింనగర్‌లో యువకుల హల్ చల్!

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో భారీ ప్రమాదం తప్పింది. టాలీవుడ్ యువ హీరో ధర్మ (Actor Dharma) నివాసంలోకి శుక్రవారం ఒక కారు అతివేగంగా దూసుకురావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు కారును అదుపులేకుండా నడపడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

ఫిలింనగర్ రోడ్డుపై అతివేగంతో ప్రయాణిస్తున్న సదరు కారు, ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి నేరుగా హీరో ధర్మ ఇంటి (Actor Dharma) కాంపౌండ్ వాల్‌ను ఢీకొట్టి లోపలికి దూసుకెళ్లింది. ఈ ప్రమాద సమయంలో ఇంట్లో ఉన్నవారంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, హీరో కుటుంబ సభ్యులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు.

ధర్మ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకున్నారు. యువకులు ఫుల్‌గా మద్యం సేవించి వాహనం నడిపినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, సదరు యువకులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.

Read Also: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. ఎన్ని గంటలు నిద్రపోవాలి?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>