ఢిల్లీకి బీఆర్ఎస్ నేతలు.. సీఈసీతో సమావేశం

కలం, వెబ్ డెస్క్ : భారత రాష్ట్ర సమితి నాయకుల బృందం (BRS Leaders) నేడు ఢిల్లీలో పర్యటించనుంది. ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు కేంద్ర ఎన్నికల కమిషనర్‌తో ఈ బృందం ప్రత్యేకంగా భేటీ కానుంది. దేశంలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ‘ఎస్ఐఆర్’ (SIR) అంశంపై పలు సూచనలు చేయడంతో పాటు, దేశవ్యాప్తంగా ‘ఒక వ్యక్తికి ఒకే ఓటు’ (వన్ పర్సన్ వన్ ఓట్) విధానాన్ని పక్కాగా అమలు చేయాలని బీఆర్ఎస్ నేతలు ఈ సందర్భంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను కోరనున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఒక వినతిపత్రాన్ని కూడా సమర్పించనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>