వింబుల్డ‌న్‌లో స్టార్ హీరోయిన్ల సంద‌డి!

క‌లం, వెబ్ డెస్క్‌: లండన్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక వింబుల్డన్ (Wimbledon) టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో సౌత్ ఇండియా హీరోయిన్స్‌ కల్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan), శ్రీలీల (Sreeleela) సందడి చేశారు. మ్యాచ్‌ను వీక్షిస్తూ గ్యాలరీలో సందడి చేసిన వీరిద్దరు ఈ వేడుక‌కు సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. స్వయంగా వింబుల్డన్ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ కూడా వీరి ఫోటోలను షేర్ చేస్తూ మిమ్మల్ని వింబుల్డన్‌లో చూడటం ఎంతో ఆనందంగా ఉంది కల్యాణి ప్రియదర్శన్ అంటూ పోస్ట్ పెట్టింది. శ్రీలీల కూడా అదిరిపోయే ఫ్యాషన్ దుస్తుల్లో క‌నిపించి అంద‌రినీ ఆక‌ట్టుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>