Mobile Popup Ad
Mobile Popup Ad

హాలాండ్‌కు తీసిపోడు.. కేన్‌పై ఇంగ్లండ్ స్టార్ ప్రశంసలు!

క‌లం, వెబ్ డెస్క్‌: హ్యారీ కేన్‌ (Harry Kane)పై ఇంగ్లండ్ డిఫెండర్ జెడ్ స్పెన్స్ (Jed Spence) ప్రశంసలు కురిపించాడు. ఎర్లింగ్ హాలాండ్ (Erling Haaland) ఎంత గొప్ప ఫినిషరో… హ్యారీ కేన్ కూడా అంతే అని అన్నాడు. జెడ్ స్పెన్స్ చేసిన ఈ వ్యాఖ్య ఇప్పుడు ఫుట్‌బాల్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారాయి. నార్వేతో జరిగే ఫిఫా వరల్డ్‌కప్ క్వార్టర్‌ఫైనల్‌కు ముందు అతడు తన కెప్టెన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. హాలాండ్‌లో అత్యంత ప్రమాదకరమైన ఆయుధం ఏంటని స్పెన్స్‌ను ప్రశ్నించగా, అతడు ఒక్క మాటతో సమాధానం ఇచ్చాడు. ఫినిషింగ్‌నే హాలాండ్ బలం అని చెప్పాడు. అలాంటి ఫినిషర్‌ను ఇంతకు ముందు చూశావా అని అడగగా, హ్యారీ కేన్ పేరు చెప్పాడు. ఫినిషింగ్ విషయంలో కేన్ కూడా హాలాండ్ స్థాయిలోనే ఉంటాడని స్పష్టంగా తెలిపాడు.

ఈ వరల్డ్‌కప్‌లో ఇద్దరూ అద్భుత ఫామ్‌లో ఉన్నారు. హాలాండ్ నాలుగు మ్యాచ్‌ల్లో ఏడు గోల్స్ చేశాడు. ఐవరీ కోస్ట్‌పై విజయం అందించిన గోల్‌తో పాటు, బ్రెజిల్‌పై రెండు గోల్స్ చేసి నార్వేను చరిత్రలో తొలిసారి క్వార్టర్‌ఫైనల్‌కు చేర్చాడు. మరోవైపు కేన్ ఐదు మ్యాచ్‌ల్లో ఆరు గోల్స్, ఒక అసిస్ట్ నమోదు చేశాడు. డీఆర్ కాంగోపై రెండు గోల్స్ చేసి ఇంగ్లండ్‌ను గెలిపించాడు. మెక్సికోపై ఒక గోల్, ఒక అసిస్ట్‌తో మరో విజయాన్ని అందించాడు.

ఇదే సమయంలో మరో ఇంగ్లండ్ డిఫెండర్ డాన్ బర్న్ కూడా హాలాండ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హాలాండ్‌తో పోరాడటం తనకు ఇష్టమని చెప్పాడు. అతడితో శారీరకంగా తలపడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. జట్టు అవసరమైతే హాలాండ్‌ను కట్టడి చేసే బాధ్యతను ఆనందంగా తీసుకుంటానని వెల్లడించాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>