మెస్సీతో మ్యాచ్ ఆడితే చాలు.. రిటైర్మెంట్ తీసుకుంటా!

క‌లం, వెబ్ డెస్క్‌: ఫిఫా వరల్డ్‌కప్ క్వార్టర్‌ఫైనల్లో స్విట్జర్లాండ్‌కు అర్జెంటీనాతో పోరు ఖరారైంది. ఈ మ్యాచ్‌లో లియోనెల్ మెస్సీ (Lionel Messi)
ని ఎదుర్కొనే అవకాశం రావడంతో అమ్‌డౌనీ (Zeki Amdouni) ఆనందం దాచుకోలేకపోయాడు. సోషల్ మీడియాలో చేసిన పోస్టులో మెస్సీతో మ్యాచ్ ఆడటం తన కల అని చెప్పాడు. ఆ కల నెరవేరితే ఫుట్‌బాల్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పినా తనకు బాధ ఉండదని సరదాగా పేర్కొన్నాడు. రౌండ్ ఆఫ్-16లో స్విట్జర్లాండ్ సంచలనం సృష్టించింది. కొలంబియాను పెనాల్టీ షూటౌట్‌లో 4-3తో ఓడించింది. నిర్ణీత సమయం, అదనపు సమయంలో గోల్స్ నమోదు కాలేదు. షూటౌట్‌లో అమ్‌డౌనీ తన పెనాల్టీని విజయవంతంగా గోల్‌గా మలిచాడు.

గత సీజన్‌లో మోకాలి గాయంతో ఎక్కువ మ్యాచ్‌లకు దూరమైన అతడు, ఇప్పుడు మళ్లీ పూర్తి ఫిట్‌నెస్ దిశగా అడుగులు వేస్తున్నాడు. మరోవైపు అర్జెంటీనా కూడా ఉత్కంఠభరిత విజయంతో క్వార్టర్‌ఫైనల్ చేరింది. ఈజిప్ట్‌పై 3-2తో గెలిచింది. రెండు గోల్స్ వెనుకబడిన స్థితి నుంచి అద్భుతంగా పుంజుకుంది. మెస్సీ ఒక గోల్ చేయడమే కాక మరో గోల్‌కు అసిస్ట్ ఇచ్చాడు. ఈ అసిస్ట్‌తో మెస్సీ మరో చరిత్ర సృష్టించాడు. వరల్డ్‌కప్‌లో అత్యధిక అసిస్టులు చేసిన డియెగో మారడోనా రికార్డును అధిగమించాడు. ఈ టోర్నీలో ఇప్పటికే ఐదు మ్యాచ్‌ల్లో ఎనిమిది గోల్స్ చేసిన మెస్సీ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పుడు మెస్సీ-అమ్‌డౌనీ ముఖాముఖి పోరుపైనే ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానుల చూపు నిలిచింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>