Mobile Popup Ad
Mobile Popup Ad

బాలకార్మికులను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరం: ఎస్పీ

కలం, కరీంనగర్ బ్యూరో: ఆపరేషన్ ముస్కాన్–XII (Operation Muskaan) కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని VRK కాలేజీ వద్ద ఇటుక బట్టీ ని జిల్లా (Karimnagar Police) ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న కార్మికుల పరిస్థితిని పరిశీలించి, బాలలను పనిలో నియమించారా లేదా అనే అంశంపై ప్రత్యేకంగా ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. బాలకార్మికులను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా శిక్షార్హమైన నేరమని అన్నారు.

ప్రతి చిన్నారికి విద్య, ఆరోగ్యం, సురక్షిత బాల్యం రాజ్యాంగం కల్పించిన హక్కులని, వాటిని హరించే హక్కు ఎవరికీ లేదన్నారు. ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకుని చిన్నారులను పనిలో పెట్టుకోకూడదని అన్నారు. 14 సంవత్సరాల లోపు పిల్లలను ఏ వాణిజ్య సంస్థలోనైనా, హోటళ్లు, టీ దుకాణాలు, గ్యారేజీలు, వర్క్‌షాప్‌లు, ఇటుక బట్టీలు, పరిశ్రమలు, గృహ సేవలు లేదా ఇతర ఉపాధి రంగాల్లో పనిలో పెట్టుకోవడం పూర్తిగా నిషేధించబడిందన్నారు. ఆపరేషన్ ముస్కాన్–XII ద్వారా బాలకార్మికులు, వీధి బాలలు, తప్పిపోయిన చిన్నారులు, బలవంతపు శ్రమకు గురవుతున్న పిల్లలను గుర్తించి రక్షించడం, వారికి విద్య, వైద్యం, పునరావాసం కల్పించడం ప్రధాన లక్ష్యమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పోలీసులు, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖ, విద్యాశాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం తదితర శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఎక్కడైనా బాలకార్మికులు పనిచేస్తున్నట్లు గమనించినా, బలవంతపు శ్రమకు గురవుతున్న చిన్నారుల గురించి సమాచారం తెలిసినా వెంటనే డయల్–100 లేదా చైల్డ్ హెల్ప్‌లైన్–1098 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

Read Also: 35 దాటిన మహిళల్లో ఇన్ఫెర్టిలిటీ ముప్పు.. కారణాలివే!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>