కలం, వెబ్ డెస్క్: బెంగళూరుకు (Bengaluru) మారడం తన కెరీర్‌ను ఎలా మలుపు తిప్పిందో వివరిస్తూ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ భువేశ్ ఆర్య ట్విట్టర్ పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తన 15 ఏళ్ల కెరీర్లో పుణె, ముంబై, హైదరాబాద్, ఢిల్లీ NCR వంటి నగరాల్లో పనిచేసినప్పటికీ, బెంగళూరు ఇచ్చిన వృద్ధి మరే నగరం ఇవ్వలేదని పేర్కొన్నారు. ఇక్కడి ట్రాఫిక్, మౌలిక సదుపాయాల సమస్యలు అందరికీ తెలిసినవే అయినప్పటికీ.. ఈ నగరం అంతులేని అవకాశాల మహాసముద్రమని కొనియాడారు. కేవలం నాలుగేళ్లలోనే మెరుగైన ఉద్యోగ అవకాశాలు, జీతాల పెరుగుదల, పరిశ్రమ దిగ్గజాలతో పరిచయాలు లాంటివి వృత్తిపరమైన విలువను ఎంతో పెంచాయన్నారు.
స్థలం మారడం వల్ల లభించే విలువను వివరించడానికి ఆసక్తికరమైన ఉదాహరణ ఇచ్చారు. ఒకే వాటర్ బాటిల్ రైల్వే స్టేషన్లో రూ.10, విమానాశ్రయంలో 100, ఫైవ్ స్టార్ హోటల్లో రూ. 500 ఉంటుంది. తన వృత్తిపరమైన విలువను భారీగా పెంచిన ఆ ‘ఫైవ్ స్టార్ హోటల్’ స్థానమే బెంగళూరు (Bengaluru) అని అభివర్ణించారు. భారత సిలికాన్ వ్యాలీ అయిన బెంగళూరుకు మరింత ముందే వచ్చి ఉండాల్సిందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పోస్ట్‌పై స్పందించిన ఇతర నిపుణులు కొందరు బెంగళూరులోని స్టార్టప్, టెక్ పర్యావరణ వ్యవస్థను సమర్థించారు. మరికొందరు ఇక్కడ నేర్చుకున్న అనుభవంతో సొంతూరిలో ఐటీ హబ్‌లను సృష్టించి ఆవిష్కరణలను ప్రోత్సహించాలని సూచించారు.
Read Also: 35 దాటిన మహిళల్లో ఇన్ఫెర్టిలిటీ ముప్పు.. కారణాలివే!
Follow Us On: X(Twitter)

