Mobile Popup Ad
Mobile Popup Ad

నర్సింగ్ ఆఫీసర్లకు రాష్ట్రస్థాయి తొలి ఇండక్షన్ శిక్షణ ప్రారంభం

కలం, వెబ్ డెస్క్ : నూతనంగా నియమితులైన నర్సింగ్ ఆఫీసర్ల (Nursing Officers)కు రాష్ట్ర స్థాయి తొలి ఇండక్షన్ శిక్షణ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ప్రభుత్వ వైద్య సేవల నాణ్యతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) ఆధ్వర్యంలో 2026 బ్యాచ్‌కు చెందిన నూతనంగా నియమితులైన నర్సింగ్ ఆఫీసర్ల కోసం రాష్ట్ర స్థాయి ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అసిస్టెంట్ డైరెక్టర్ (నర్సింగ్) విజయ నిర్మల నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ ఏ.నరేంద్రకుమార్ మాట్లాడుతూ, ఆరోగ్య సేవల అందింపులో నర్సింగ్ ఆఫీసర్ల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. “రోగిని మొదటిసారిగా ఆహ్వానించే ఆరోగ్య సంరక్షణ నిపుణుడు నర్సింగ్ ఆఫీసరే, చివరి వరకు రోగి పక్కనే ఉండే వ్యక్తి కూడా నర్సింగ్ ఆఫీసరే. ఈ మహోన్నత సేవా వృత్తి కోసం దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు” అని డాక్టర్ ఏ.నరేంద్రకుమార్ అన్నారు.

నూతనంగా నియమితులైన నర్సింగ్ ఆఫీసర్లు (Nursing Officers) కేవలం వైద్య సేవలు అందించే ఉద్యోగులు మాత్రమే కాకుండా, మానవత్వం, కరుణ, ఆశలకు ప్రతినిధులుగా ఉండాలని సూచించారు. ప్రతి రోగిని చిరునవ్వుతో, గౌరవంతో, సానుభూతితో ఆహ్వానిస్తూ, సురక్షితమైన, నైతిక విలువలతో కూడిన, శాస్త్రీయ ఆధారిత నాణ్యమైన నర్సింగ్ సేవలను అందించాలని సూచించారు. నర్సింగ్ అనేది కేవలం క్లినికల్ విధానాలకు మాత్రమే పరిమితం కాదని, సమర్థవంతమైన కమ్యూనికేషన్, భావోద్వేగ సహకారం, వృత్తి నైపుణ్యం, జట్టుగా పనిచేసే తత్వం, బాధ్యతాయుత వైఖరి, రోగి సంక్షేమం పట్ల అంకితభావం కూడా అంతే ముఖ్యమని తెలిపారు.

ఈ ఇండక్షన్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రభుత్వ సేవల్లో నర్సింగ్ ఆఫీసర్లు సమర్థవంతంగా పనిచేసేందుకు అవసరమైన అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ సేవా నియమాలు, సీసీఏ (CCA) రూల్స్, సర్వీస్ అంశాలు, ఉద్యోగ బాధ్యతలు, బేసిక్ లైఫ్ సపోర్ట్ (CPR), రోగి భద్రత, ఇన్ఫెక్షన్ నివారణ, నియంత్రణ, రికార్డుల నిర్వహణ, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, వృత్తి నైతికత, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, ఆసుపత్రి విధివిధానాలు, పరిపాలనా వ్యవస్థ, జట్టుగా పనిచేసే విధానం, ప్రజాసేవ విలువలపై సమగ్ర శిక్షణ అందించనున్నట్లు వివరించారు. ప్రతి నర్సింగ్ ఆఫీసర్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ జ్ఞానం, నైపుణ్యం, సేవా దృక్పథాన్ని నిరంతరం అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ శిక్షణ కార్యక్రమంలో చీఫ్ నర్సింగ్ ఆఫీసర్ సుజాత (ఎంజీఎం ఆసుపత్రి), సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ శిరీష, లెక్చరర్ హారిత, అలాగే నర్సింగ్ ఆఫీసర్లు రాజన్, దీపక, లక్ష్మణ్, రామానాయుడు, కొండల్ నాయక్, అనూరాధ, ప్రవళిక, కృష్ణ తదితరులు పాల్గొని వివిధ విద్యా సెషన్లు, పరస్పర చర్చల్లో తమ అనుభవాలను పంచుకున్నారు.

Read Also: కదిలే రైలులో హనీమూన్.. నెట్టింట వీడియో వైరల్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>