Mobile Popup Ad
Mobile Popup Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీ పై సోనాలి బింద్రే ప్రశంసలు

కలం, వెబ్ డెస్క్: సీనియర్ నటి సోనాలి బింద్రె (Sonali Bendre) తెలుగులో ఎన్నో సినిమాలు చేశారు. నార్త్‌కు చెందిన ఈ ముద్దుగుమ్మ చేసినవి తక్కువ సినిమాలే అయినా అవన్నీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. మురారి, మన్మథుడు, ఇంద్ర, ఖడ్గం, శంకర్ దాదా MBBS ఇలా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుని తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే ఇటీవల సోనాలి బింద్రే హిందీ, తెలుగు సినిమా పరిశ్రమలను పోలుస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

హిందీ కంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ బెటర్ అని ప్రశంసించారు. హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీతో పోలిస్తే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా ఆర్గనైజ్డ్‌గా ఉంటుందని కొనియాడారు. బాలీవుడ్ కంటే టాలీవుడ్ సినిమాల బడ్జెట్, ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంటాయని అన్నారు. తెలుగు సినిమాల్లో పనిచేస్తున్నప్పుడు షూటింగ్ సెట్స్‌లో లభించిన ఆహారం అద్భుతంగా ఉండేదని సోనాలి బింద్రే (Sonali Bendre) ప్రశంసించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read Also: స్వీట్లు తినడానికి సరైన సమయం ఏది? నిపుణులు చెప్పిన నిజాలు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>