Mobile Popup Ad
Mobile Popup Ad

దొరకని మత్స్యకారుల ఆచూకీ.. ముగిసిన సెర్చ్ ఆపరేషన్

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ తీరంలో గల్లంతైన మత్స్యకారుల (Fishermen Missing Case) కోసం చేపట్టిన విస్తృత స్థాయి సెర్చ్ ఆపరేషన్ ముగిసింది. గత కొన్ని రోజులుగా ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ, ఏపీ మెరైన్ పోలీసలు సంయుక్తంగా సముద్రంతో పాటు తీర ప్రాంతంలో తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టాయి.

అనుకూల వాతావరణ పరిస్థితులు లేకపోవడంతో అత్యాధునిక పరికరాలు, పడవలు, నౌకలు, హెలికాప్టర్ల సహాయంతో మత్స్యకారుల కోసం గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో ప్రస్తుతానికి సెర్చ్ ఆపరేషన్‌ను (Search Operation) అధికారులు ముగించినట్లు ప్రకటించారు. అయితే మత్స్యకారులపై (Fishermen Missing Case) ఏదైనా సమాచారం లభించిన వెంటనే అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

సెర్చ్ ఆపరేషన్ కు సంబంధించిన నివేదికను అధికారులు త్రిసభ్య కమిటీకి సమర్పించనున్నారు. అనంతరం బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ నెల 1న విశాఖపట్నం తీరం నుంచి చేపల వేట కోసం బోటులో సముద్రంలోకి వెళ్లగా ప్రమాదం జరిగింది. ఈ ఘటన సమయంలో బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. వీరిలో ఒకరు ప్రాణాలతో సురక్షితంగా బయటపడగా ఆరుగురు ఆచూకీ లభించలేదు.

Read Also: శివాలయంలో అపచారం.. దీపంతో సిగరెట్ వెలిగించిన యువకుడు!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>