Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం!

కలం, వెబ్ డెస్క్ : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi)కి మరో అంతర్జాతీయ అత్యున్నత పురస్కారం దక్కింది. ఇండోనేసియా ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘బింటాంగ్‌ ఆదిపూర్ణ రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇండోనేసియా’ను ప్రధాని మోదీకి ప్రకటించింది. ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోతో జరిగిన అధికారిక భేటీలో ఈ విషయాన్ని వెల్లడించారు.

ఇండోనేసియా ఐక్యత, ప్రగతి, శ్రేయస్సుకు విశేష కృషి చేసిన వ్యక్తులకు మాత్రమే ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందజేస్తారు. ఈ అరుదైన గౌరవంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది కేవలం తనకు దక్కిన గౌరవం కాదని, 140 కోట్ల మంది భారత ప్రజలకు లభించిన గొప్ప గౌరవమని ఆయన పేర్కొన్నారు. ఈ పురస్కారం భారత్-ఇండోనేసియా దేశాల మధ్య ఉన్న దృఢమైన స్నేహ బంధానికి, పరస్పర నమ్మకానికి, వ్యూహాత్మక భాగస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తుందని ఇరు దేశాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>