కలం, వెబ్ డెస్క్ : మణిపూర్ ఉగ్రదాడితో దేశం మొత్తం ఉలిక్కిపడింది. ఉఖ్రుల్ పట్టణంలో జవాన్ల కాన్వాయ్ పై ఉగ్రమూకలు విరుచుకుపడ్డాయి. సోమవారం జరిగిన ఈ దాడి (Manipur Militant attack)లో ఇద్దరు అస్సాం రైఫిల్స్ జవాన్లు మృతి చెందారు. నుంగ్షాంగ్కొంగ్ ప్రాంతంలో 40వ అస్సాం రైఫిల్స్ కాన్వాయ్‌పై మిలిటెంట్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పలువురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. భద్రతా దళాలు మిలిటెంట్ల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.

