ఇక పట్టుకునే బాధలుండవ్.. ఫాలో అయ్యే గొడుగు ఇదిగో!

కలం, వెబ్ డెస్క్: చేతితో పట్టుకునే అవసరం లేకుండా వర్షం, ఎండ నుంచి రక్షణ కల్పించే ఫ్లయింగ్ అంబ్రెల్లా (Flying Umbrella) వచ్చేసింది. కెనడియన్ ఇంజినీర్ జాన్ త్సే వినూత్నమైన ‘ఫ్లయింగ్ అంబ్రెల్లా’ (ఎగిరే గొడుగు)ను రూపొందించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. సాధారణ పసుపు రంగు గొడుగులా కనిపించే దీనిని డ్రోన్‌గా మార్చాడు. ‘ఐ బిల్డ్ స్టఫ్’ అనే యూట్యూబ్ ఛానెల్‌లో దీనికి సంబంధించిన వివరాలను షేర్ చేశాడు. ఇది మనుషులను ఆటోమేటిక్‌గా ఫాలో అవుతుందని పేర్కొన్నారు.

ఈ గొడుగు రూపకల్పనలో ప్రొపెల్లర్లను అమర్చడం సవాలుగా మారింది. గొడుగు మధ్యలో ఉండే రాడ్ మాత్రమే బలంగా ఉంటుంది. మడతపెట్టే వీలుండే ప్రత్యేకమైన డిజైన్‌ను రూపొందించారు. గొడుగును ఉపయోగించనప్పుడు ఈ ఆర్మ్స్ లోపలికి ముడుచుకుంటాయి, తెరిచినప్పుడు లాక్ అవుతాయి. గొడుగు ఎగిరేటప్పుడు ఊగకుండా స్థిరంగా ఉంచేందుకు హింజెస్‌, రబ్బర్ బ్యాండ్లతో 3D ప్రింటెడ్ భాగాలను ఇందులో ఉపయోగించారు.

ఇందులో ముఖ్యమైన ఫీచర్ ఏమిటంటే.. పట్టుకోకాకుండానే మనిషిని ట్రాక్ చేసి రక్షణగా నిలుస్తుంది. యూజర్ తల భాగాన్ని గుర్తిస్తూ ఫ్లైట్ కంట్రోలర్‌కు సిగ్నల్స్ పంపుతుంది. దీంతో ఈ గొడుగు ఎప్పుడూ మనిషికి సరిగ్గా తలపై భాగంలోనే కేంద్రీకృతమై ఉంటుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>