కలం, నిర్మల్ : తెలంగాణ టీ20 క్రికెట్ టోర్నమెంట్‌లో (Telangana T20 Tournament) బీజేపీ శాసనసభాపక్ష నేత, నిర్మల్(Nirmal) ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కుమారుడు శృంజిత్ రెడ్డి (Shrunjith Reddy) తన అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. సోమవారం జరిగిన మ్యాచ్‌లో మెదక్ ఫాల్కన్స్ జట్టు తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన అతడు 46 బంతులలో 60 పరుగులు చేసి జట్టుకు శుభారంభం అందించాడు.
తన ఇన్నింగ్స్‌లో మూడు భారీ సిక్సర్లు, ఆరు ఆకర్షణీయమైన ఫోర్లు బాదుతూ ప్రత్యర్థి బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. అతని దూకుడు బ్యాటింగ్ జట్టు విజయావకాశాలను పెంచడంలో కీలక పాత్ర పోషించింది. శృంజిత్ రెడ్డి (Shrunjith Reddy) ప్రదర్శనకు క్రీడాభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయిలలోనూ రాణించే సామర్థ్యం అతనికి ఉందని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తెలంగాణ టీ20లో యువ క్రికెటర్‌గా తన ప్రతిభను చాటుకోవడంతో నిర్మల్ జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: డీఎస్పీ భీమ్ రెడ్డి అరెస్ట్
Follow Us On : WhatsApp

