కలం, వెబ్ డెస్క్ : శ్రీలంక (Sri Lanka)లోని నెగొంబో జైల్లో ఖైదీల మధ్య తీవ్ర ఘర్షణలు చెలరేగాయి. ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడికి పాల్పడడంతో 25 మంది ప్రాణాలు కోల్పోగా వందమందికి పైగా గాయాలయ్యాయి. జైలులో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ గ్యాంగ్ తో మరో వర్గానికి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఘర్షణ సమయంలో పోలీసులు అక్కడే ఉన్నా ఏమీ చేయలేకపోయారు. మృతుల్లో 20 మంది ఖైదీలు ఉండగా ఐదుగురు జైలు సిబ్బంది ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘర్షణపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. కాగా, గతంలోనూ శ్రీలంకలో (Sri Lanka) ఇలాంటి గొడవలు చోటుచేసుకున్నాయి. అయితే, ఇలాంటి భారీ ఘటన జరగడం ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు.
Read Also: పాలమూరు రైతుల సోలార్ ‘పంట‘.. నెలనెలా ఆదాయం
Follow Us On: X(Twitter)

