ఏసీబీకి చిక్కిన చేర్యాల తహసీల్దార్

కలం, మెదక్ బ్యూరో: సిద్దిపేట జిల్లా చేర్యాల (Cheriyal) తహసీల్దార్ దిలీప్ నాయక్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. రైతు నుంచి రూ.70 వేలు లంచం తీసుకుంటుండగా తహసీల్దార్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తన వ్యవసాయ భూమిని ‘నాలా’ కన్వర్షన్ చేయించుకోవడానికి బాధితుడు కొన్ని రోజులుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు.

ఏసీబీ అధికారులకు ఫిర్యాదు..

అలా చేయాలంటే రూ.70 వేలు లంచం ఇవ్వాలని ఎమ్మార్వో దిలీప్ నాయక్ డిమాండ్ చేశారు. బాధితుడు వెంటనే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ​రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, తహసీల్దార్ కార్యాలయంలోనే రైతు నుంచి దిలీప్ నాయక్ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో సోదాలు జరిపారు.

Read Also: గులాబీ తోటలో బావబామ్మర్దుల పొలిటికల్ ఫైట్!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>